రాజధాని తరహాలో నగరంలో కూడా ట్యాంక్ బండ్ ఉండి ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా? మరికొద్ది రోజుల్లో నగర ప్రజలకు ఈ ముచ్చట కూడా తీరనుంది. మిని ట్యాంక్‌బండ్ మాత్రం సాక్షాత్కారం కానుంది. రాఘవయ్య,అంబేద్కర్ పార్కుల నడుమ బందరు కాలువ వెం బడి ఈ బండ్‌ను ఏర్పాటు చేస్తు న్నారు. రూ. 25 లక్షల వ్యయంతో ఇక్కడ బండ్ అభివృద్ధి చేసేందుకు కమిషనర్ రవిబాబు పచ్చజెండా ఊపారు. అటు బందరురోడ్డుకు,ఇటు జాతీయ రహదారి నడుమ రాఘ వయ్య,అంబేద్కర్ పార్కులు సందర్శ కులను విపరీతంగా ఆహ్లాదపరుస్తు న్నాయి. ఈ నేపథ్యంలో, ఈ పార్కు లకు మరిన్ని సొబగులు అద్ది చక్కటి సందర్శకుల స్పాట్‌గా మార్చాలన్నది కార్పొరేషన్ అధికారుల తాపత్రయం.
ఇంజనీరింగ్ అధికారుల ఆలోచనకు కమిషనర్ ఆమోద ముద్ర వేయటం తో బండ్ ఏర్పాటుకు సన్నాహాలు జరి గి పోతున్నాయి. అంబేద్కర్ పార్కును పూర్తిగా బండ్‌గా అభివృద్ధి పరచ నున్నారు. బందరు కాలువ బేస్‌గా భారీ గోడను కడతారు. తర్వాత రె ండవ భాగంలో ఉన్న అంబేద్కర్ పార్కును పూర్తిస్థాయిలో బండ్‌గా అభివృద్ధి చేస్తారు. చూడటానికి ఒక ట్రాక్‌లాగా తీర్చిదిద్దనున్నారు. వాకింగ్ ట్రాక్ తరహాలో ఉంటుంది. బందరు కాలు వ అందాలతో పాటు, ట్రాక్‌పై సంచ రిస్తూ పార్కు అందాలను వీక్షించే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ట్రాక్ బండ్పైనే పూల కుండీలు, ల్యాండ్ స్కేపింగ్ చేస్తుంటారు.
సంద ర్శకులు కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేందుకు చక్కటి బెంచీల ఏర్పాటు ఉంటుంది. సందర్శకులకు అందుబాటులో ఫుడ్‌కోర్టులు, ఐస్ క్రీమ్ పార్లర్లు కూడా ఇక్కడ ప్రైవేటు వారి సహకారంతో ఏర్పాటు చేయి స్తారు. జాతీయరహదారి, బందరు రోడ్డు అందాలను కూడా వీక్షించే అవ కాశం సందర్శకులకు దక్కనుంది. బండ్‌పై కళాత్మకత ఉట్టిపడేలా శిల్పా లను కానీ, విగ్రహాలను కానీ ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు చక్కటి వినో దాన్ని పంచేందుకు ఇక్కడ ఆట పరి కరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇటీవల కాలువలో బోట్లు తిప్పటానికి కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ట్రయల్స్ కూడా వేశారు.
బండ్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడే బోటింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. బండ్ దగ్గరకు వచ్చిన సందర్శకులు ఎంచక్కా బోట్లపై షికారు చేయవచ్చ న్నమాట. సాయంత్రాలు బోటింగ్ షికారుకు మంచి డిమాండ్ ఉంటుం దని అధికారులు భావిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదన ను ఆమోదించి తక్షణం పనులు చేపట్టాల్సిందిగా కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి కొద్ది రోజు ల్లోనే బండ్‌కు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more